అమెరికాలో ఏలూరు యువకుడు మృతి..
ఏలూరు (CLiC2NEWS): అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఏలూరుకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఏలూరు అశోక్ నగర్‌కు చెందిన వీరా సాయేశ్ ఎంఎస్ చదవడానికి 2021, నవంబర్‌లో అమెరికా వెళ్లాడు. అక్కడ గ్యాస్ స్టేషన్లో పార్టటైం ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం కొంతమంది దుండగులు వచ్చి విధుల్లో ఉన్న సాయేశ్‌పై కాల్పులు జరిపారు. సాయేశ్ తండ్రి కొన్నేళ్ల కిందట మరణించారు. తల్లి అన్నయ్య ఉన్నారు.