మచలీపట్నంలో దారుణం.. గొంతుకోసి మహిళా డాక్టర్ హత్య
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/nife.jpg)
మచిలీపట్నం (CLiC2NEWS): కృష్ణా జిల్లా మచలీపట్నంలో ఓ మహిళా వైద్యురాలు హత్యకు గురయ్యారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమె గొంతు కోసి నగలతో ఉడాయించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని జవ్వారు పేట జంక్షన్‌లో నివాసముంటున్న డాక్టర్ ఉమామహేశ్వరరావు, రాధ ఇద్దరూ వైద్యులే. వారే సొంతంగా చిన్న పిల్లల ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి కింది అంతస్తులో ఉన్న భర్త.. తన భార్య ఎంతకీ కిందకు రాకపోవడంతో ఫోన్‌చేశారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో మొదటి అంతస్తు పైకి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో తన భార్య రాధ కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి , నిందులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
[…] […]