టిడిపి నేత హ‌త్య‌కు కుట్ర‌.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ప‌లాస (CLiC2NEWS): శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస ప‌ట్ట‌ణం టిడిపి అధ్య‌క్షుడిని హ‌త్య చేసేందుకు ప్లాన్ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బిహార్‌కు చెందిన గ్యాంగ్ సార‌థ్యంలో చిన్న‌మ‌డం గ్రామానికి చెందిన అంపోల్ శ్రీ‌నివాస‌రావు బృందం ఆధ్వ‌ర్యంలో రూ.10 ల‌క్ష‌లు సుఫారీ ఇచ్చిన‌ట్లు సమాచారం. పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకొని హ‌త్యాయ‌త్నం అడ్డుకున్నారు. ఏడుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మ‌రికొంత‌మంది కోసం గాలిస్తున్నారు. నిందితుల నుండి రివాల్వ‌ర్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.