ప్రేమోన్మాది దాడిలో త‌ల్లి మృతి.. కుమార్తెకు గాయాలు

విశాఖ (CLiC2NEWS): న‌గ‌రంలో ప్రేమోన్మాది ఓ యువ‌తి , ఆమె త‌ల్లిపై దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో యువ‌తి త‌ల్లి ప్రాణాలు కోల్పోగా.. యువ‌తికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌ మ‌ధుర‌వాడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని స్వ‌యంకృషి న‌గ‌ర్‌లో చోటుచేసుకుంది. యువ‌తిని ప్రేమించిన న‌వీన్‌ వ్య‌క్తి ఈ దాడి చేసిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధ‌ర‌ణ‌కు వ‌చ్చారు. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో యువ‌తి ఇంటికి వెళ్లి ఆమెపై దాడిచేశాడు. అక్క‌డే ఉన్న త‌ల్లిపై కూడా కిరాత‌కంగా క‌త్తితో దాడి చేశాడు. యువ‌తి తల్లి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. తీవ్ర‌గాయాలైన యువ‌తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ప‌రారైన న‌వీన్ ను కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న సిఎం చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాధిత యువ‌తికి మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.