ఆస్తిలో చెల్లికి వాటా.. తల్లిదండ్రులను హతమార్చిన కొడుకు

విజయనగరం (CLiC2NEWS): ఆస్తికోసం కన్న తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్యచేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు (అప్పల నాయుడు, జయ) తన చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చినందుకు కక్ష పెంచుకున్న కుమారుడ రాజశేఖర్.. తల్లిదండ్రులతో తరచూ గొడవ పడుతుండేవాడు. చెల్లికి ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డు కోవడంతో మరోసారి కన్నవారితో గొడవకు దిగాడు. అనంతరం తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్యచేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.