చిరువ్యాపారులకు సాయంగా జగనన్నతోడు..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ సర్కార్ చిరు వ్యాపారులకు ఆర్ధిక భరోసా కల్పనకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు పథకం’ కింద మూడో విడత సాయాన్ని లబ్ధిదారులకు ఎపి ముఖ్యమంత్రి జగన్ సోమవారం విడుదల చేశారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి 2,10,462 మంది ఖాతాలకు రూ. 510.46 కోట్ల వడ్డీ లేని రూణాలు జమ చేశారు. అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని తెలిపారు. దీని ద్వారా లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు.
పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూశానని, అందుకే వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని సిఎం తెలిపారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లస్తే మీకు మల్లీ రుణం ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని అన్నారు. మూడో విడత సాయం కింద 510.46 కోట్లు విడుదల చేశామని అన్నారు. వడ్డీలేని రీఎంబర్స్‌మెంట్ రూ. 16.16 కోట్లతో కలిపి మొత్తంగా 526.62 కోట్లు జమచేశామని తెలిపారు.