మండపేట: మహిళా నీరాజనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్

కూటమి ప్రభుత్వం పై మహిళల ప్రశంసలు

మండపేట (CLiC2NEWS):  స్త్రీ శక్తి పథకం పై మండపేట బస్టాండ్ వద్ద నిర్వహించిన బ‌హిరంగ‌ సభకు నియోజకవర్గం నలుమూలల నుండి వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. పెద్ద ఎత్తున జ‌నం రావడంతో బస్టాండ్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో పలువురు మహిళలు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. ఆనాడు అన్న ఎన్.టి.ఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు మహిళలకు వివిధ పదవుల్లో అధిక ప్రాధాన్యత, రాజకీయ రిజర్వేషన్లు కల్పించారని.. ఆయన తరువాత అదే దారిలో చంద్రబాబు పలు పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు విశేష కృషి చేస్తున్నార‌న్నారు.

అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ.. తనను వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరికీ పాదాభివందనం తెలియజేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో భాగంగా పింఛన్లు అందరికీ మూడు నెలలు వెనక్కి వెళ్ళి మరీ ఇచ్చార‌ని ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. మూడు వేలు ఉండే దివ్యాంగుల పింఛనును 6 వేలు పెంచామ‌న్నారు. పింఛన్లు నిమిత్తం ఏటా 192 కోట్లు ఒక్క మండపేట నియోజకవర్గం నుండే ఖర్చు అవుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ప్రజలు సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే వేగుళ్ళ సూచించారు. ఐదేళ్లు పాటు ప్రజలు నెల నెల కట్టే విద్యుత్ బిల్లును బ్యాంకులకు కడితే రాబోయే 20 ఏళ్ల పాటు విద్యుత్ బిల్లు కట్టాల్సిన పని లేదన్నారు.

ఒకప్పుడు చంద్రబాబు హైద్రాబాద్ ను అభివృద్ధి చేస్తే ప్రస్తుతం అది తెలంగాణా రాష్ట్రం మొత్తాన్ని మోస్తుందని, అలాగే అమరావతి అభివృద్ధి జరిగితే ఆ ప్రభావం మన రాష్ట్రం అంతటా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరిలో కలపాలని కోరినా..  గత పాలకులు పట్టించుకోలేద‌న్నారు. అయితే,  ప్ర‌స్తుతం ఆ బాధ్య‌త త‌న‌ద‌న్నారు. రాబోయే సంవత్సరాల్లో ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు అన్నం పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, మండపేట మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్,  జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

తరవాణిపేటలో విద్యా గణపతి పూజకు హాజ‌రైన ఎమ్మెల్యే వేగుళ్ల‌

 

Leave A Reply

Your email address will not be published.