Mandapet: విశ్వ సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడిగా నక్కిన వీరరాఘవరావు

మండపేట (CLiC2NEWS): ప్రముఖ సాహితీ సాంస్కృతిక సంస్థ ‘విశ్వ సాహితీ కళావేదిక’ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నక్కిన వీరరాఘవరావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయిత, జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత నక్కిన వీరరాఘవరావు మండ‌పేటకు చెందిన తెలుగు పండితుడు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాలతో పాటు రాష్ట్ర విద్యా శిక్షణ సంస్థలో విషయ నిపుణునిగా విశిష్ట సేవలందిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కోనసీమ జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు గండి స్వామి ప్రసాద్, ప్రముఖ కవి, రచయిత టి నరేంద్ర, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు ఆయనను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.