పవన్ కల్యాణ్‌పై పోటీ చేయడానికి సిద్ధమేనన్న అలీ
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/ali-speach.jpg)
తిరుపతి (CLiC2NEWS): పార్టీ ఆదేశిస్తే.. పవన్‌పై పోటీ చేయడానికి రెడీ అని సినీ నటుడు, ఎపి ప్రభుత్వ సలహాదారు అలీ అన్నారు. తిరుపతిలో అలీ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో వైఎస్ ఆర్ పార్టీ 175 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని.. పవన్‌కల్యాణ్ నాకు మంచి మిత్రుడన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఎక్రడినుండైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అలీ తెలియజేశారు.