నేడు టిడిపి తీర్థం పుచ్చుకోనున్న గిరిధర్ రెడ్డి

నెల్లూరు (CLiC2NEWS): నెల్లూరు రూరల్ నియోజకవర్గ నేత ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం టిడిపిలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారీ ర్యాలీగా మంగళగిరికి చేరుకోనున్నారు. దాదాపు 300 కార్లతో నెల్లూరు నుండి మంగళగిరికి వెళ్లడానికి కోటంరెడ్డి అనుచరులు ఈ ర్యాలీని ప్రారంభించినట్లు సమాచారం. నెల్లూరు నగరంలోని కస్తూరి గార్డెన్స్ నుండి మంగళగిరి వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. మధ్యాహ్నం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో గిరిధర్ రెడ్డి ఆ పార్టీ చేరనున్నారు.