హీరోయిన్ చేయాలని .. ఓ తల్లి తన కుమార్తెకు రోజూ ఇంజెక్షన్లు!
విజయనగరం (CLiC2NEWS): తన కుమార్తెను హీరోయిన్ చేయాలనుకుని.. ఓ తల్లి తన కుమార్తెకు రోజూ ఇంజెక్షన్లు ఇస్తుంది. చెప్పుడు మాటలు విని తన కుమార్తె త్వరగా పెద్దదవ్వాలని ఈ విధంగా చేస్తున్నట్లు సమాచారం. ఈ దారుణం విజయనగరంలో చోటుచేసుకుంది. నగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌కు సమీపంలో నివాసం ఉంటున్న మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆమెకు కూతురు పుట్టాక మొదటి భర్త చనిపోయాడు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను కూడా వదిలేసి వెళ్లిపోవడంతో.. మరో వ్యక్తితో కలిసి ఉంటుంది. కూతురు విశాఖ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవలే పదోతరగతి పూర్తి చేసుకొని తల్లి వద్దకు వచ్చింది. ఇంటికి తరచూ ఎవరో ఒకరు వస్తుండటంతో తల్లి గొడవపడేది. ఇంటికి వచ్చే వారిలో ఒకరు కూతురిని హీరోయిన్ చేయవచ్చుకదా.. హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయనడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. రోజూ ఇంజెక్షన్లు వద్దన్నా వినకపోవడంతో కూతురు 1098కి ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. చైల్డ్‌లైన్ సిబ్బంది వెంటనే స్పందించి బాలికను అధీనంలోకి తీసుకుని.. విశాఖలోని స్వాధార్ హోమ్‌కు పంపించారు.