విశాఖ శారదాపీఠంలో సిఎం జగన్ ప్రత్యేక పూజలు
విశాఖపట్నం (CLiC2NEWS): విశాఖ శ్రీ శారదాపీఠం వార్హిక మహోత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. రాజశ్యామల ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల పూజకోసం వేద పండితులు ముఖ్యమంత్రి చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు. అనంతరం జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలు, మొడల్స్ అందజేశారు. ఈకార్యక్రమంలో అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
