కాబోయే వ‌రుడిపై క‌త్తితో దాడి..

అన‌కాప‌ల్లి (CLiC2NEWS): పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేక ఓ యువ‌తి కాబోయే వ‌రుడిపై దాడి చేసింది. యువ‌తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించ‌గా.. క‌త్తితో దాడి చేసింది త‌నే అని యువ‌తి ఒప్పుకున్న‌ట్లు డిఎస్పి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను పోలీసులు మీడియాకు వివ‌రించారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రామానాయుడు, పుష్ప‌కు మే 20వ తేదీన వివాహం నిశ్చయించారు. అమ్మాయి, అబ్బాయి. క‌లిసి సోమ‌వారం స్కూటిపై బ‌య‌ట‌కు వెళ్లారు. త‌ల్లిదండ్రుల అనుమ‌తితోనే ఇద్ద‌రు బ‌య‌టికి వెళ్లారు. వ‌డ్డాది వ‌ద్ద స్కూటి ఆపి గిప్ట్ కొటాన‌ని పుష్ప షాప్‌లోకి వెళ్లింది. ఏం కొన్నావ‌ని అడిగితే అబ్బాయికి చెప్ప‌లేదు. యుక‌వ‌కుడిని విశ్వాశాంతి జ్యోతిర్మ‌యి ఆశ్ర‌మం వ‌ద్ద‌కు తీసుకెళ్లింది. బ‌హుమ‌తి ఇస్తాను, క‌ళ్లు మూసుకో అని చెప్పి క‌ళ్ల‌కు త‌న చున్నీని క‌ట్టింది. అనంత‌రం త‌న‌తో తీసుకొచ్చిన క‌త్తితో అబ్బాయి గొంతు కోసింది. పెళ్లి ఇష్టం లేక‌నే గొంతు కోసిన‌ట్లు త‌న‌తో చెప్పింది. ఆ యువ‌తి ఎక్క‌డ ఆత్మ‌హ‌త్య చేసుకుంటుందోన‌ని యువ‌తితో స‌హా రామానాయుడు వెళ్లాడు. స్థానికులు గ‌మ‌నించి రామానాయుడిని ఆసుప‌త్రిలో చేర్పించారు. ఆయితే ఆ యువ‌తి ఎవ‌రినీ పెళ్లి చేసుకోవ‌డం ఇష్టంలేద‌ని తెలిపింది. దైవ చింత‌న‌తో ఓంశాంతి ఆశ్ర‌మంలో జీవితం గ‌డ‌పాల‌ని ఆమె భావిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.