బండి సంజయ్ దీక్ష భగ్నం.. అరెస్టు
కరీంనగర్ (CLiC2FNEWS): కరీంనగర్‌లో హైడ్రామా నడుమ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. జివో 317 న సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఆయన కార్యాలయం వద్ద బండిసంజయ్ చేపట్టిన జాగరణ దీక్షలు పోలీసులు భగ్నం చేశారు. బిజెపి కార్యాలయంలోపల దీక్ష కొనసాగిస్తున్న సంజయ్‌ను పోలీసులు తాలాలు పగుల గొట్టి అరెస్టు చేశారు. అనంతరం మానుకొండూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అడ్డుకున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసుల తీరుపై పలువురు బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.