Telangana: రాష్ట్రంలో మార్చి 7 నుండి బ‌డ్జెట్ స‌మావేశాలు

ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్ష‌త‌న ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

Tహైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ వార్షిక బ‌డ్జెట్ స‌మావేశాల తేదీలు ఖ‌రారు కోసం సోమ‌వారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్ష‌త‌న ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. మార్చి 7వ తేదీ నుండి శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ స‌మావేశంలో రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి హరిశ్‌రావు, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఐటి పురపాల‌కు శాఖామంత్రి కెటిఆర్, ఇత‌ర మంత్రులు, ఆర్ధిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు. మార్చి 6వ తీదీన ప్ర‌గ‌తిభ‌వ‌న్లో రాష్ట్ర మంత్రి వ‌ర్గం స‌మావేశ‌మై 2022-23 ఆర్ధిక సంవ‌త్స‌రానికి వార్షిక బ‌డ్జెట్‌ను ఆమోదం తెల‌ప‌నుంది. మార్చి 7 న ప్రారంభ‌మ‌య్యే బ‌డ్జెట్ స‌మావేశాల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి హారీశ్ రావు రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.