టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
ఢిల్లీ (CLiC2NEWS): పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలను సాధించవచ్చు. మొత్తం 1,675 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో సెక్యూరిటీ అసిస్టెంట్– ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1,525 ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ సిబ్బంది పోస్టులు 150 ఉన్నాయి. జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 ఏళ్లకు మించరాదు. సెక్యూరిటి– ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అయితే 27 ఏళ్ల వరకు ఉంది. ఎస్‌టి, ఎస్‌సి అభ్యర్థులకు ఐదేళ్లు వయో సడలింపు ఉంది. ఒబిసిలకు మూడేళ్ల పాటు సడలింపు ఉంది.