గోల్డెన్ వీసాను అందుకున్న కాజ‌ల్..

 

టాలివుడ్ చంద‌మామ‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. కాజ‌ల్అగ‌ర్వాల్‌కు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యుఎఈ) ప్ర‌భుత్వం గోల్డెన్ వీసాను అందించింది.  ఈగోల్డెన్ వీసాతో యుఎఈ లో ఎలాంటి ఆంక్ష‌లు లేకుండా దీర్ఘ‌కాలికంగా నివాసం, వ్యాపారం నిర్వ‌హించుకోవ‌చ్చ‌.   ఈ వీసాతో యుఎఈ ప్ర‌భుత్వం క‌ల్పించే అన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌ళారంగానికి చెందిన సెల‌బ్రిటీల‌కు యుఎఈ ప్ర‌భుత్వం త‌న‌వంతు ప్రోత్సాహాన్ని అందిస్తోంద‌ని,  ఈ అరుదైన గౌర‌వం ల‌భించినందుకు కాజ‌ల్ అగ‌ర్వాల్ సంతోషంగా ఉంద‌ని తెలిపారు. యుఎఈ ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యంతో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఎదురుచూస్తున్నాన‌ని కాజ‌ల్‌ పేర్కొంది.

భార‌త్‌నుండి ఈ వీసా పోందిన సినీ ప్ర‌ముఖుల్లో మొద‌టివ్య‌క్తిగా షారుఖ్‌ఖాన్ ఉన్నారు. త‌ర్వాత సంజ‌య్‌ద‌త్, సునీల్‌శెట్టి, మౌనీరాయ్‌, ఫ‌రాఖాన్‌, బోనీ క‌పూర్ ఫ్యామిలీ, నేహా క‌క్క‌ర్‌, సింగ‌ర్ సోనూ నిగ‌మ్ ఈవీసాల‌ను పొందారు. మోహ‌న్ లాల్ , మ‌మ్ముట్టి, టోవినో థామ‌స్‌, దుల్క‌ర్ స‌ల్మాన్ అందుకున్నారు. రామ‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఈ వీసాను అందుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.