Pawan Kalyan: హరిహర వీరమల్లు కోసం చార్మినార్ సెట్..
హైదరాబాద్ (CLiC2NEWS): జ్యోతికృష్ణ , క్రిష్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేసినట్లు నిర్మాత ఎ ఎం రత్నం తెలిపారు. జులూ 24న ప్రేక్షకులు ముందుకు రాబోతున్ ఈ చిత్రంలో ఎన్నో ఆసక్తికల విషయాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. వీరమల్లు పాత్రను ఎన్‌టి ఆర్, ఎంజిఆర్ నుండి స్ఫూర్తి పొంది డిజైన్ చేసుకున్నట్లు దర్శకుడు తెలియజేశారు. తాను స్క్రిప్ట్ రాసుకున్నపుడు పవన్‌కల్యాణ్‌ను ప్రజలు హీరోగా కంటే కూడా నాయకుడిగా చూడటం మొదలు పెట్టారన్నారు. అందుకు తగినట్లుగానే కొన్ని సన్నివేశాలు తీర్చిదిద్దినట్లు వివరించారు. ఆయుధాలు సైతం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలిపారు.
హీరో పవన్‌కల్యాణ్ ని నిజమైన చార్మినార్ దగ్గరకు తీసుకెళ్లి ఉదయం ఒకట్రెండు గంటలు షూటింగ్ చేయవచ్చు కానీ.. తాము అనుకున్నట్లు ఆ సన్నివేశాలు తీయలేమని ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేసినట్లు తెలిపారు. అసలైన చార్మినార్ ఎంత సైజ్‌లో ఉంటుందో అంతే సెట్ క్రియేట్ చేసి షూట్ చేయాల్పి వచ్చిందన్నారు. అంతేకాకుండా హార్బర్ సెట్ కూడా వేశారు. 17 వ శతాబ్దంలో ఓడరేవులు ఎలా ఉండేవో అలాగే తీర్చిదిద్దినట్లు తెలిపారు. థియోటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు నాటి కాలానికి వెళ్లిన అనుభూతి కలుగుతుందన్నారు.
హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతుంది. పార్ట్ -1 స్వోర్డ్ అండ్ స్పిరిట్ జులై 24న విడుదలవుతుంది. రన్‌టైమ్ 2:42 నిమిషాలు ఉంటుంది. పార్ట్ -2 కి సంబంధించి కొంత షూట్ పూర్తయినట్లు సమాచారం.