చిరు పాదాలకు నమస్కారం చేసిన ధనుష్..
హైదరాబాద్ (CLiC2NEWS): హీరో ధనుష్ మెగాస్టార్ చిరంజీవి పాదాలకు నమస్కారం చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది. ధనుష్ , నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. మంచి ప్రేక్షకాదరణ అందుకున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ జరుపుకుంటోంది. ఈ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ధనుష్ ఆడిటోరియంలోకి రాగానే అందరినీ పలకరిస్తూ వస్తూ.. చిరంజీవి కాళ్లకు నమస్కారం చేశారు. దీంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం ఆదివారం సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది.