రేపు నిరుద్యోగుల కోసం కీల‌క ప్ర‌క‌ట‌న: సిఎం కెసిఆర్‌

వ‌న‌ప‌ర్తి (CLiC2NEWS): నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో రేపు కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నాన‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.
వ‌న‌ప‌ర్తి లో సిఎం కెసిఆర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వ‌న‌ప‌ర్తిలో ప‌లు అభివృద్ధి కార్యాక్ర‌మాల‌ను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. మ‌న ఊరు-మ‌న బ‌డి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన అనంత‌రం వ‌న‌ప‌ర్తి జిల్లా క‌లెక్ట‌రేట్ స‌మీకృత భ‌వ‌న స‌ముదాయాన్ని సిఎం ప్రారంభించారు.

సాయంత్రం ప్ర‌భుత్వ వైద్య‌క‌ళాశాల భ‌వ‌నాన్నినిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సిఎం మాట్లాడుతూ.. వ‌న‌ప‌ర్తి జిల్లా అవుతుంద‌ని ఎవ‌రూ వూహించ‌లేదు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ఎక్క‌డ చూసినా క‌రువు, బాడు భూముల కిన‌పించేవని అన్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 5 మెడిక‌ల్ కాలేజ్‌లు ఏర్ప‌ట‌య్యాయ‌న్నారు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్త‌యితే జిల్లా వ‌జ్ర‌ర‌పు తున‌క‌గా మారుతుంద‌ని సిఎం పేర్కొన్నారు. గ‌తంలో పాల‌మూరు జిల్లా నుండి ల‌క్ష‌ల మంది వ‌ల‌స పోయేవారు. వ‌న‌ప‌ర్తిలో ఎక‌రం భూమి రూ. 3 ల‌క్ష‌లు ఉండేది, ఇపుడు రూ. 3 కోట్ల ద‌ర పల‌కుతోంద‌న్నారు. ఒక్క మెడిక‌ల్ కాలేజీ లేని పాల‌మూరులో 5 మెడిక‌ల్ కాలేజీలు ఎలా సాధ్య‌మ‌య్యాయని అన్నారు. తెలంగాణ ఉద్య‌మం కోసం ఎలా కొట్లాడామో.. ఈ దేశంలో శాంతి, సామ‌ర‌స్యాన్ని, మంచిన కాపాడేందుకు అవ‌స‌ర‌మైతే నాప్రాణం కూడా ధార‌పోసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని సిఎం స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.