వ‌న‌ప‌ర్తిలో ‘మ‌న ఊరు-మ‌న‌ బ‌డి’ పైలాన్‌ను ఆవిష్క‌రించిన సిఎం కెసిఆర్‌

వ‌న‌ప‌ర్తి (CLiC2NEWS): వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుండి రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న ప్రారంభిస్తామ‌ని సిఎం కెసిఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్రారంభోత్స‌వాలు చేశారు. ఈరోజు ఉద‌యం వ‌న‌ప‌ర్తి చేరుకున్న సిఎంకు జిల్లా మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధ‌లు ఘ‌న‌స్వాగతం ప‌లికారు. ఈసంద‌ర్భంగా ‘మ‌న ఊరు-మ‌న బ‌డి’ పైలాన్‌ను సిఎం, మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీ‌నివాస్ గౌడ్ లు ఆవిష్క‌రించారు.

ఇంత‌కు ముందు వ‌న‌ప‌ర్తి శివారు చిట్యాల‌లోని మార్కెట్ యార్డును ప్రారంభించారు. అనంత‌రం టిఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాల‌యం, స‌మీకృత జిల్లా కార్యాల‌యాల స‌ముదాయాల‌ను సిఎం ప్రారంభించ‌నున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.