ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో సిఎం కెసిఆర్ భేటీ
ముంబయి (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అనంతరం కెసిఆర్ శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. దేశ రాజకీయాలతో పాటు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కెసిఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. శరద్ పవార్‌తో భేటీ ముగిసిన అనంతరం సిఎం కెసిఆర్ హైదరాబాద్ తిరిగి రానున్నారు.
ఈ సమావేశంలో ఎంపిలు సంతోష్ కుమార్, డా. రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, ఎమ్మెల్సీ శ్రీమతి కవిత , పల్లా రాజేశ్వర్ రెడ్డి, టిఆర్ ఎస్ ప్రదాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, సినీ నటుడు ప్రకాష్‌రాజ్ పాల్గొన్నారు.