చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణస్వీకారానికి వెళ్తా.. సిఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన , బిజెపి కూటమి మొత్తం 164 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఈ నెల 11 లేదా 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి చంద్రబాబు తనను ఆహ్వానిస్తే వెళ్తానని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎపిలో ఈ ఏప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే సిఎం చెప్పినట్లు గుర్తు చేశారు. ఎపి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్నారు. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడతానని సిఎం తెలిపారు.