ఎపిఎస్ ఆర్టీసిలో కారుణ్య నియామ‌కాలు: పేర్నినాని

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపిఎస్ ఆర్టీసీలో కొత్తగా కారుణ్య నియామ‌కాలు చేస్తున్నామ‌ని మంత్రి పేర్నినాని తెలిపారు.  రాష్ట్రంలో మొత్తం 1800 కు పైగా ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామ‌కాలు చేస్తున్నామ‌ని తెలియ‌జేశారు. నియామ‌కాలు సంబంధిత జిల్లాలోనే ఇస్తామ‌ని, క‌లెక్ట‌ర్లకు ఆదేశాలిచ్చి లిస్ట్‌లు పంపిస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు.

ఆర్టీసీని ప్ర‌భుత్వంలోకి తీసుకోవ‌డం వ‌ల‌న మూడు వేల కోట్ల పైన భారం ప‌డుతుంద‌ని, ఉద్యోగుల భ‌విష్య‌త్తు దృష్ట్యా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు.కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల వ‌ల‌న ఆర్టీసికి న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని, కేంద్ర ఇచ్చే ఆయిల్ ధ‌ర కంటే బ‌య‌ట బంకుల్లో నాలు రూపాయ‌లు త‌క్కువకే వ‌స్తుంద‌ని అన్నారు. రోజుకు కోటిన్న‌ర రూపాయ‌ల భారం ఆర్టీసిపై త‌గ్గుతుంద‌ని తెలిపారు. ఆర్టీసీకి న‌ష్టాలు రాకూడ‌ద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మంత్రి అన్నారు. ఎలక్ట్రిక్ బ‌స్సుల‌కు టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే40 బ‌స్సులు అందుబాటులోకి రానున్నాయ‌ని, మిగ‌తాఇ మ‌రికొన్ని వారాల్లోనే అందుతాయ‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.