దేశంలో కొత్త 1.79 ల‌క్ష‌ల క‌రోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా13.52 ల‌క్ష‌ల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 1,79,723 మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. కాగా నిన్న‌టి కేసుల‌తో పోలిస్తే 12.6 శాతం పెరుగుద‌ల క‌నిపించింది. అలాగే గ‌డ‌చిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 46,569 మంది క‌రోనా నుంచి కోలుక‌న్నారు.
అలాగే గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 146 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 4,83,936 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

దేశ‌వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కి చేరింది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ సోమ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 1216 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.