India Corona: కొత్త‌గా 2,47,417 కేసులు

న్యూఢిల్లీ (CLiC3NEWS): దేశంలో క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోది.  క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా 5 వేల‌కు పెరిగాయి.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశ‌వ్యాప్తంగా దాదాపు 18 ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుప‌గా 2,47,417 మందికి వైర‌స్ పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.  ఈ మేర‌కు గురువారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య మంత్రి త్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.   దీంతో రోజు వారి పాజిటివిటి రేటు 12.11 శాతానికి పెరిగింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి దేశంలోమొత్తం కేసుల సంఖ్య  3,63,17,927 కి చేరింది.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3,47,15,361 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.
  • తాజాగా గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 380 మంది క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 4,85,035 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.
  • ప్ర‌స్తుతం దేశంలో 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

  • తాజా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5488కి పెరిగింది.
  • వీరిలో 2162 మంది బాధితులు కోలుకున్నారు.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 620 మందిలో కొత్త వేరియంట్‌ను గుర్తించారు.
Leave A Reply

Your email address will not be published.