33 వేలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో తాజాగా 33,750 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో మొత్తం కేసులు 3,49,22,882కు పెరిగాయి. ఇప్పటి వరకు 3,42,95,407 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 4,81,893 మంది మరణించారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 10,846 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 123 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 123 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1700లకు చేరింది. ఇప్పటి వరకు 639 మంది కోలుకున్నారు.