దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న క‌రోనా కేసులు

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఒక్క రోజులో 12,591 కొత్త కేసులు న‌మోదైయ్యాయి. రోజు రోజుకీ కొత్త కేసులు సంఖ్య పెరుగుతూ వ‌స్తుంది. ఈ కేసుల్లో ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ 1.16 ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న‌ట్లు స‌మాచారం. కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ బూస్ట‌ర్ డోసు తీసుకోవాల‌ని కేంద్రం సూచించింది.

గ‌డిచిన 24 గంట‌ల్లో 12 వేల కేసులు న‌మోద‌య్యాయి. కేసులు సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ ఆస్ప‌త్రిలో చేరే వారి సంఖ్య త‌క్కువ‌గానే ఉంటుంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ‌ తెలిపింది. కానీ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, రానున్న రోజుల్లో కేసులు ఎక్కువ‌వుతాయ‌ని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.