హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాలు ఆరెస్ట్..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 3 ముఠాలను నార్కొటిక్ అధికారులు ఆరెస్టు చేశారు. నిఘా ఉంచిన నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డ్రగ్స్ వ్యవహారాన్ని బయటపెట్టిందని సిపి సి.వి ఆనంద్ తెలిపారు. మొత్తం 11 మందిని ఆరెస్టు చేశామని వెల్లడించారు. నిందితుల్లో సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్, పిజి విద్యార్థులు ఉన్నారన్నారు. వీరికి ఇదివరకే కౌన్సెలింగ్ ఇచ్చి విడిచ పెట్టామని, అయినా వారిలో మార్పు రాలేదని ఆనంద్ తెలిపారు. అందుకే విద్యార్థులను కూడా అరెస్టు చేశామని అన్నారు. వీరితో యువతులు కూడా ఉన్నారు.డార్క్నైట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటూ పట్టుబడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని సిపి ఆనంద్ తెలిపారు.
నిందితుల్లో ఒకరు నైజీరియన్ ఉన్నాడు. ఇతను వీసా గడువు పూర్తయినప్పటికీ ఇక్కడే ఉంటున్నాడని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకునే వారు కార్పొరేట్ సంస్థల్లో మంచి స్థానాల్లో ఉద్యోగం చేస్తున్నారన్నారు.