ఈనెల నుండే పేద‌ల‌కు స్థ‌లం ఉంటే రూ. 3ల‌క్ష‌లు :మంత్రి కెటిఆర్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ఐటి, ప‌రిశ్ర‌మల శాఖా మంత్రి కెటిఆర్ ‘పేద‌ల‌కు స్థ‌లం ఉంటే రూ. 3 ల‌క్ష‌లు ఈనెల నుండే ఇస్తాం’ అని తెలిపారు. మ‌ల్లారం వైకుంఠ‌ధామం ప్రారంభించిన మంత్రి కెటిఆర్ , నాచారం హెచ్ ఎంటి న‌గ‌ర్లో ఎస్టిపి ప్లాంట్ ప‌నుల‌కు మంత్రి ఈరోజు భూమిపూజ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. వ‌ర్షాలు ప‌డితే మూసీకి వ‌ర‌ద‌లు వ‌చ్చి ఇబ్బందులు ప‌డ్డాం. ఇపుడు రూ. 900 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి చేప‌డుతున్నామ‌న్నారు. ప్ర‌తి వ‌ర్ష‌పు చుక్క మూసీలోకి వెళ్లేలా నాలాల అభివృద్ధి చేప‌డుతున్నామ‌ని, నాచారంలో రూ. 75 కోట్ల‌తో ఎస్టిపి ఏర్పాటు చేస్తున్నామ‌ని అన్నారు. ఉప్ప‌ల్ కూడ‌లికి రెండు వైపులా పైవంతెన‌లు నిర్మిస్తున్నామ‌ని , వ‌చ్చేనెల్లో ఉప్ప‌ల్‌లో రూ. 35 కోట్ల‌తో ఏర్పాటైన స్కైవాక్ ప్రారంభిస్తామ‌ని మంత్రి తెలిపారు.

వ‌చ్చేనెలలో ల‌బ్ధిదారుకు కొత్త పింఛ‌న్లు పంపిణీ చేస్తామ‌ని, అసెంబ్లీ స‌మావాశ‌లు ముగిశాక రెండు ప‌డ‌క‌ల ఇల్లు అంద‌జేస్తామ‌ని మంత్రి తెల‌పారు.

Leave A Reply

Your email address will not be published.