మణిపుర్లో ముఖ్యమంత్రి సభావేదికకు మంటలు..

ఇంఫాల్ (CLiC2NEWS): మణిపూర్‌లోని చురాచాంద్‌పుర్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన జిమ్, క్రీడా వసతి కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉంది. గురువారం రాత్రి సిఎం సభా వేదికను నిరసనకారులు దహనం చేశారు. ప్రభుత్వం చిత్తడి నేలలతో పాటు రిజర్వ్, రక్షిత అటవీ ప్రాంతాలను సర్వే చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసే ఆదీవాసీ గిరిజన నాయకుల వేదిక అనే సంస్థ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రాష్ట్ర సర్కార్ ప్రార్థనా స్థలాలలను కూల్చివేస్తోందని గిరిజన నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. గురువారం నూతన క్రీడా వసతిలోని కుర్చీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. స్పోర్స్ పరికరాలను దహనం చేశారు. దీంతో సభా వేదికకు కూడా మంటలు వ్యాపించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంత 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు ఆదేశాలిచ్చారు.
[…] […]