త‌న కుమారుడితో పాటు 25 జంట‌ల‌కు సామూహిక వివాహాలు: బిజెపి ఎమ్ఎల్ఎ

ముంబ‌యి (CLiC2NEWS): త‌న కుమారుడి వివాహంతో పాటు 25 జంట‌ల‌కు సామూహిక వివాహాలు జ‌రిపించారు బిజెపి ఎమ్ ఎల్ ఎ అభిమ‌న్యు ప‌వార్‌. మ‌హారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో నిరుపేద‌లైన 25 జంట‌ల‌కు సామూహిక వివాహాలు జ‌రిపించారు. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎక్‌నాథ్ శిండే, ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్‌ హాజ‌ర‌య్యారు. ఔసా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్ ఎల్ ఎ జ‌రిపించిన సామూహిక వివాహాల‌లో త‌న కుమారుడి వివాహం కూడా జ‌రిగింది. సిఎంతో పాటు మంత్రులు, ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రై దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. ఎమ్ ఎల్ ఎ కృషిని అంద‌రూ ప్ర‌శంసించారు.

Leave A Reply

Your email address will not be published.