కారు డోర్ అద్దం క్లోజ్ చేయడంతో బయటకు చూస్తున్న చిన్నారి మృతి..
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
సూర్యపేట (CLiC2NEWS): పెళ్లి వేడుకలో విషాదం చోటుచోసుకుంది. కారులో కూర్చుని బయటకు చూస్తున్న చిన్నారి .. డ్రైవర్ కారు డోర్ అద్దం బటన్ ప్రెస్ చేయగానే చిన్నారి మెడ ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సూర్యపేట జిల్లాలోని బొజ్జగూడెం గ్రామంలో జరిగింది. బాణోతు ఇంద్రజ అనే చిన్నారి పెళ్లి కారులో కూర్చుని..బయట జరుగుతున్న డాన్సులు చూస్తుండగా ప్రమాదానికి గురైంది. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.