క‌ర్నూలు జిల్లాలో భారీగా బంగారం బిస్కెట్లు, న‌గ‌దు ప‌ట్టివేత‌..

బ‌నియ‌న్లలో బంగారు బిస్కెట్లు, బ‌స్సులోని సీట్ల కింద న‌గ‌దు

క‌ర్నూలు (CLiC2NEWS): క‌ర్నూలులోని పంచ‌లింగాల చెక్‌పోస్ట్ వ‌ద్ద సుమారు రూ. 5 కోట్లు విలువ‌చేసే బంగారం, వెండి బిస్కెట్లు ఎస్ఇబి అధికారులు ప‌ట్టుకున్నారు. ఓ ప్రైవేటు బ‌స్సులో ఐదుగురు ప్ర‌యాణికుల వ‌ద్ద 8.2500 కిలో బంగారు బిస్కెట్లు, 28.5 కిలోల వెండి, రూ. 90 ల‌క్ష‌ల న‌గదు ఉన్న‌ట్లు బ‌స్సును త‌నిఖీ చేసిన అధికారులు గుర్తించారు. వీటిని త‌ర‌లిస్తున్న దేవ‌రాజు, సెల్వ‌రాజు, కుమావేలు, మురుగేశ‌న్‌, వెంక‌టేశ్‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరు హైద‌రాబాద్ నుండి కోయంబ‌త్తూరు వెళ్తుండ‌గా ప‌ట్ట‌కున్నారు.

ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన బ‌నియ‌న్లలో బంగారు బిస్కెట్ల‌ను ,బ‌స్సులోని సీట్ల కింద న‌గ‌దు దాచి త‌ర‌లించ‌డానికి ఈ ఐదుగురు య‌త్నించిన‌ట్లు అధికారులు తెలిపారు. వీటికి సంబంధించిన జిఎస్టి, ఈ-వే బిల్లులు, ట్రావెలింగ్ ఓచ‌ర్తు కానివీరివ‌ద్ద లేవు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.