ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్: ఎపి స‌ర్కార్‌

11వ పిఆర్‌సి సిఫార్సుల ప్ర‌కారం ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో శుభ‌వార్త తెలిపింది. 11వ పిఆర్‌సి సిఫార్సుల ప్ర‌కారం పిల్ల‌ల దత్త‌త‌, పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌, విక‌లాంగుల‌కు స్పెష‌ల్ క్యాజువ‌ల్ సెల‌వులు, ప‌లు వ్యాధుల‌కు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వ ప‌ధాన కార్య‌ద‌ర్శి ష‌మీర్ సింగ్ రావ‌త్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఈ జిఓ ప్ర‌కారం పిల్ల‌ల సంర‌క్ష‌ణ సెల‌వుల‌ను 60 రోజుల‌నుండి 180 రోజుల‌కు పెంచుతూ పిఆర్‌సి సిఫార్సుల మేర‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్న ఉద్యోగి 180 రోజుల వ‌ర‌కూ సెల‌వు తీసుకోవ‌చ్చు. సెల‌వు రోజుల‌కు కూడా పూర్తి జీతం తీసుకోవ‌చ్చు. ఈ సెల‌వుల‌ను వేరే ఇత‌ర సెల‌వుల‌తో క‌లిపి కూడా ఉప‌యోగించుకొనే అవ‌కాశం క‌ల్పించారు. ద‌త్త‌త శిశువు వ‌య‌సు నెల‌రోజుల‌లోపు ఉంటే సంవ‌త్స‌రం పాటు సెల‌వు ఇస్తారు. శిశువు వ‌య‌సును బ‌ట్టి సెల‌వులు తీసుకోవ‌చ్చు. ఇవ‌న్నీ కూడా ఇత‌ర సెల‌వుల‌కు అద‌నంగా తీసుకోవ‌చ్చు . అయ‌తే ద‌త్తత తీసుకొనే వారికి ఇద‌వ‌ర‌కే ఇద్ద‌రు పిల్ల‌లు ఉంటే ఇవేమీ వ‌ర్తించ‌వు.

వికలాంగులైన ఉద్యోగులు త‌మ కృత్రిమ అవ‌యువాల‌ను మార్చుకునేందుకు ఏటా ఏడురోజుల పాటు స్పెష‌ల్ క్యాజువ‌ల్ సెల‌వుల‌ను పొంద‌వ‌చ్చు. హైరిస్క్ వార్డుల్లో ప‌నిచేసే న‌ర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ సెలువులు తీసుకోవ‌చ్చు.

ప్రాణాంత‌క వ్యాధుల‌కు చికిత్స పొందుతున్న ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది. బేసిక్ పే లిమిట్ రూ. 35,570 ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ. 11,560 నుండి రూ. 17,780 వ‌ర‌కూ పొంద‌వచ్చు. లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులు రూ. 10వేల నుండా రూ. రూ. 15 వేల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. అదేవిధంగా ఆర్జిత సెల‌వులు, సగం జీతం సెల‌వులు ముగిసిన త‌రువాల‌త కూడా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ సెల‌వులు తీసుకోవ‌చ్చు.

Leave A Reply

Your email address will not be published.