నెల్లూరులోని నివాసానికి చేరుకున్న గౌతమ్ రెడ్డి భౌతికకాయం
అమరావతి (CLiC2NEWS): గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఎపి రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం నెల్లూరులోని నివాసానికి చేరుకుంది. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం మంత్రి నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. తమ అభిమాన నేత కడసారి చూపుకోసం పెద్ద ఎత్తున్న పార్టీ కార్యకర్తలు, అబిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. అమెరికా నుండి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి ఈరోజు సాయంత్రానికి నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మొరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.