పిల్లలకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత తల్లిదండ్రులదే..
హైదరాబాద్ (CLiC2NEWS):అర్హులైన పిల్లలందరికీ కరోనా టీకా ఇస్తామని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 1014 కేంద్రాల్లో 15-18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో టీకాల పంపిణీ జరుగుతోందని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని పిహెచ్‌సిలో రాష్ట్ర వైద్య మంత్రి హరీష్రావు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంబించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తల్లిదండ్రులంతా పిల్లలకు విధిగా కరోనా టీకా లు వేయించాలని అన్నారు. పిల్లలకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత తల్లిదండ్రులదే అని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు.