సొరకాయ రసంతో సంపూర్ణ ఆరోగ్యం..

చిన్న వయస్సులోనే చాలామందికి తెల్ల వెంట్రుకలు వస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. కొందరికి బాగా తినాలనిపిస్తుంది.. కానీ తింటే అజీర్తని, అరగదని అంటారు. మరికొందరు ఎసిడిటీతో బాధపడుతుంటారు. ఇలాంటి వారందరికి సొరకాయ రసం మంచి ప్రయోజనాన్నిస్తుందని నిపుణులు అంటున్నారు.
అలసిన దేహానికి సొరకాయ రసం ఉపశమనమిస్తుంది. సొరకాయలో పీచు, నీరు అధిక శాతం ఉంటాయి. యుక్తవయసు వారు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు ఆరోగ్యంగా ఉండి.. తిరిగి పూర్వపు స్తితికి చేరుకుంటుంది.
ప్రయోజనాలు..
- ఎసిడిటిని తగ్గిస్తుంది.
- మన శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
- బిపి ఉన్నవాళ్లు వారంలో మూడు సార్లు సొరకాయ రసం తాగితే రక్తప్రసరణ అదుపులో ఉంచుతుంది.
- బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
- హైబిపీ ఉన్నవాళ్లు ఒకరోజు సొరకాయ రసం తాగి మరుసటి రోజు తేడా గమనించవచ్చు.
- గుండె ఆరోగ్యం కాపాడుతుంది.
సొరకాయను కూర రూపంలో గాని, సలాడ్‌లా కూడా తీసుకోవచ్చు. పచ్చి ముక్కలు తినగలిగితే కూడా మంచిదే. హల్వా తయారు చేసుకోవచ్చు. సొరకాయ జ్యూస్‌లో తులసి అకులు లేదా పొదీనా కూడా వేసుకోవచ్చు.