ప్రియురాలితో సన్నిహితంగా ఉన్నాడని.. జూనియర్ ఆర్టిస్ట్ హత్య
హైదరాబాద్ (CLiC2NEWS): గత నెల 13వ తేదీ నుండి ఆచూకీ కనిపించని జూనియర్ ఆర్టిస్ట్ కార్తీక్.. హత్యకు గురైనట్లు జూబ్లిహిల్స్ పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిసిటివి పుటేజి సెల్ సిగ్నళ్ల ఆధారంగా కార్తీక్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన సాయి నగరంలో యూట్యూబర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి జూనియర్ ఆర్టిస్ట్ అయిన యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ యువతి జూనియర్ ఆర్టిస్ట్ కార్తీక్ పరిచయమయ్యాడు. తన ప్రేయసితో కార్తీక్ దగ్గరవుతున్నందుకు కక్ష పెంచుకున్న సాయి.. అతనిని చంపాలని నిర్ణయించుకున్నడు. తన స్నేహితులను పిలిపించి కార్తీక్‌ను హత్య చేశాడు.
హత్య జరిగిన అనంతరం ముగ్గురు నిందితులు అక్కడినుండి సొంతూళ్లకు వెళిపోయారు. కానీ సురేష్ మీతుడి సెల్‌ఫోన్ తీసుకొని నగరంలోనే ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మొబైల్ ఆన్ చేయడంతో పోలీసులు వెంటనే అతని ఆచూకీ కనుగొన్నారు. అతనిని అదుపులోకి తీసుకొని మిగిలిన వారిని కూడా అరెస్టు చేశారు.