అనుమానమే పెనుభూతమై.. భార్య, కుమారుడిని చంపి భర్త ఆత్మహత్య
హైదరాబాద్ (CLiC2NEWS): భార్యను, కుమారుడిని హత్యచేసి, భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. నగరంలోని బేగంబజార్‌లో సిరాజ్ కుటుంబం ఉత్తప్రదేశ్ నుండి వలస వచ్చి ఉంటుంది. సిరాజ్ బ్యాంగిల్ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ కారణంగా సిరాజ్.. భార్య హేలియాను గొంతుకోసి, కుమారుడు హైజాన్‌ను గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం సిరాజ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చూసిన అతని పెద్ద కుమారుడు భయంతో పరుగులు తీశాడు. భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.