అనుమానం పెనుభూతమై.. నిండు చూలాలిని బలిగొన్న భర్త!
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నిండు చూలాలు అనే కనికరం కూడా లేకుంబా భర్తే భార్య ప్రాణాలు బలిగొన్నాడు. భార్యపై అనుమానంతో ఆమె కడుపుపై కూర్చుని భర్త ఊపిరాడకుండా చేయడంతో శిశువుతో సహా ఆమె ప్రాణాలు కోల్పోయింది. భార్యను హతమార్చి, ప్రమాదంగా చిత్రీకరించాలకున్న ప్రబుద్ధుడు చివరికి పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న కాచిగూడకు చెందిన సచిన్ సత్యనారాయణ, స్నేహ కు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. వీరిద్దరూ 2022 లో వివాహం చేసుకున్నారు. 2023లో వీరికి బాబు పుట్టాడు. అనంతరం సచిన్ పని మానేసి జులాయిగా తిరగడం ప్రారంభించాడు. దీంతో ఆర్దిక ఇబ్బందులు తలెత్తాయి. తన కొడుకును పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి రూ. లక్షకు అమ్మాలని చూశాడు. విషయం తెలుసుకున్న భార్య పోలీసులు సాయంతో కొడుకును రక్షించుకుంది. ఆనారోగ్య కారణాలతో ఆ బాబు మృత్యువాత పడ్డాడు. వరుస ఘటనలు, గొడవలతో భార్యభర్తలిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో తిరిగి భార్యా భర్తలిద్దరూ కాప్రాలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య ఏడు నెలల గర్భిణి అని తెలుసుకున్న సచిన్,, గర్భం ఎలా వచ్చిందంటూ వేధించడం మొదలుపెట్డాడు. ఆమెకు మద్యం తాగించి, ఆమె కడుపై కూర్చుని దిండుతో ముఖంపై ఊపిరాడకుండా చేయడంతో కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఈ ఘటనను ప్రమాదం చిత్రీకరించాలనుకుని గ్యాస్ సిలిండర్ పైప్ తీసేసి పరారయ్యాడు. గ్యాస్ అయిపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇంటి నుండి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాధానం అందించారు. నిందితుడిని కాచిగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.