రూ. 50లక్షలు ఇన్సూరెన్స్ సొమ్ము కోసం.. అనాథను హత్యచేసి రోడ్డు ప్రమాదంగా మార్పు
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/SHADNAGAR-CASE.jpg)
షాద్‌నగర్ (CLiC2NEWS): షాద్‌నగర్‌లో దారుణం చేటుచోసుకుంది. ఎరరూలేని ఓ అనాథను పనిలో పెట్టుకుని, అతని పేరిట బీమా చేయించాడు. ఆ బీమా డబ్బుల కోసం అతన్ని చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత సంవత్సరం డిసెంబర్‌లో షాద్‌నగర్ పరిధిలోని మొగిలివద్ద భిక్షపతి అనే వ్యక్తి మరణించాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కేసు ఛేదించారు.
మేడిపల్లికి చెందిన భిక్షపతి.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట బోడ తండాకు చెందిన బోడ శ్రీకాంత్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్.. ఓ బ్యాంకులో భిక్షపతి పేరుమీద రూ. 50 లక్షలు బీమా చేయించాడు. తర్వాత అదే బ్యాంకులో అతని పేరుమీదే రూ. 52 లక్షల రుణం తీసుకొని ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. శ్రీకాంత్ ఆ ఇంటిని అమ్మడానికి ప్రయత్నించగా.. భిక్షపతి అడ్డుపడటంతో అతనిని హతమార్చేందుకు శ్రీకాంత్ పథకం వేశాడు. దీని కోసం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోతీలాల్‌ను, తనదగ్గర పనిచేసే సతీష్ సహాయంతో భోక్షపతిని చంపడానికి పన్నాగం వేశాడు. పథకం ప్రకారం గత ఏడాది డిసెంబర్ 22న భిక్షపతిని హాకీ స్టిక్‌తో దాడిచేసి.. కారుతో తొక్కించి హత్యచేశారు. దీనిని పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. మరోవైపు ఇన్సూరెన్స్ డబ్బులు కోసం నిందుతులు బీమా సంస్థను సంప్రదించగా.. డబ్బులకు ప్రయత్నిస్తున్న వ్యక్తికి.. మృతి చెందిన వ్యక్తికితో సంబంధం లేకపోవడంతో పోలీసులను సంప్రదించారు.
Looking for a sexy and flirtatious chat experience? Then look
no further than our chat rooms! Our fully nude chat girls are waiting
to chat with you about anything and everything.