నగరంలో పదేళ్ల బాలిక దారుణ హత్య!
హైదరాబాద్ (CLiC2NEWS): స్కూల్‌కి సెలవు ఉండటంతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్న పదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నగరంలోని కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగీత్ నగర్‌లో కుమారుడు, కుమార్తెతో భార్యాభర్తలు నివసిస్తున్నారు. ఆ కుటుంబంలో కుమార్తె ఆరోతరగతి చుదవుతోంది. తండ్ర బైక్ మెకానిక్ , తల్లి ల్యాబ్ టెక్నీషియన్ విధులు నిర్వహిస్తోతంది. సోమవారం కుమారుడిని స్కూల్‌కి పంపించారు. అనంతరం తల్లిదండ్రులు ఇద్దరూ తమ పనులకు వెళ్లిపోయారు. కుమార్తె కేంద్రీయ విద్యాలయంలో ఆరోతరగతి చుదవుతోంది. సోమవారం సెలవు ఉండటంతో బాలిక ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకు కుమారుడికి లంచ్ బాక్స్ ఇచ్చేందుకు ఇంటికి వచ్చాడు. తలుపులు తీసి చేసేసరికి బెడ్ మీద కత్తి పోట్లతో బాలిక విగతజీవిగా పడి ఉంది. వెంటనే తండ్రి కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలిక మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కూకట్ పోలీసులతో పాటు బాలానగర్ డిసిపి సైతం ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
[…] Crime News: నగరంలో పదేళ్ల బాలిక దారుణ హత్య! […]
[…] నగరంలో పదేళ్ల బాలిక దారుణ హత్య! […]