వ్య‌క్తిగ‌త జీవితంపై అసంతృప్తి..

అబ్ధుల్లాపూర్‌మెట్ (CLiC2NEWS): ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న‌ వ్య‌క్తి.. త‌న వ్య‌క్తిగ‌త‌ జీవితంపై విర‌క్తి క‌లిగి అదృశ్య‌మ‌య్యాడు.. పోలీసులు తెలిప‌న వివ‌రాల ప్ర‌కారం..
ఖ‌మ్మం చెందిన ఓ యువ‌కుడు ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తూ.. హాస్ట‌ల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 7వ తేదీన హాస్ట‌ల్ నుండి ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా వెళ్లిపోయాడు. ఎంత‌కీ తిరిగి రాక‌పోవ‌డంతో హాస్ట‌ల్ నిర్వాహ‌కులు కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచార మిచ్చారు. త‌ల్లిదండ్రులు 17 వ తేదీన అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే ఆ యువ‌కుడు గ‌తంలో కూడా ఇదే మాదిరిగా ఇంటి నుండి వెళిపోయి కూలి ప‌నులు చేసిన‌ట్లు గుర్తించారు. ఊహించ‌న‌ట్లే మార్కెట్లో హ‌మాలి ప‌నులు చేస్తూ క‌నిపించిన యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.పోలీసులు 12 గంట‌ల వ్వ‌వ‌ధిలోనే అత‌న్ని గుర్తించి కుటుంబ స‌భ్యులకు అప్ప‌గించారు.

Leave A Reply

Your email address will not be published.