వరంగల్ వైద్యవిద్యార్థిని ప్రీతి చెల్లెలకు ప్రభుత్వ ఉద్యోగం..
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/TS-logo.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): వరంగల్ వైద్య కళాశాలలో అనస్తీషియా మొదటి సంవత్సరం పిజి వైద్యవిద్యార్థిని ప్రీతి
ఆత్మహత్యకు పాల్పడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రీతి చెల్లెలు పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హెచ్ ఎండిఎలో ఉద్యోగం ఇస్తూ.. హైదరాబా్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటి ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రీతిని పరామర్శించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.