చౌహమల్లా ప్యాలెస్‌లో ప్రపంచ సుందరీమణులకు విందు..

హైదరాబాద్ (CLiC2NEWS): మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం మిస్ వరల్డ్ కంటెస్టంట్‌లకు నగరంలోని చౌహమల్లా ప్యాలెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు ప్రపంచ సుందరీమణులందరూ హాజరయ్యారు. సిఎం రేవంత్ రెడ్డి దంపతులులతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు. హైదరాబాదీ రుచులతో పలురకాల వంటకాలతో వారికి విందును ఏర్పాటు చేశారు.
ప్రపంచ సుందరీమణులు ఈ రోజు నగరంలోని చారిత్రాత్మక కట్టణం చార్మినార్‌ను సందర్శించారు. హెరిటేజ్ వాక్ లో భాగంగా వీరంతా చార్మినార్‌కు చేరుకున్నారు. వీరికి సంప్రదాయ అఅరబ్బి మర్ఫా సంగీతంలో స్వాగతం పలికారు. చార్మినార్ అందాలు, చుట్టుపక్కల ప్రాంతాలను సందరీమణులు సందర్శించారు. లాడ్ బజార్‌లో పలు దుకాణాలు సందర్శించి సందడి చేశారు.