ఏప్రిల్ నుండి కెసిఆర్ న్యూట్రిష‌న్ కిట్‌ ప‌థ‌కం అమ‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): వ‌చ్చే నెల‌ నుండి 9 జిల్లాల్లో కెసిఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కం అమ‌లు చేయ‌బోతున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా కెసిఆర్ కిట్ ప‌థ‌కం అమ‌లుపై స‌భ్యుల అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి మాట్లాడుతూ.. కెసిఆర్ కిట్ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత ప్ర‌భుత్వ అస్ప‌త్రుల్లో ప్ర‌స‌వాల సంఖ్య పెరిగింద‌ని మంత్రి తెలిపారు. ఈప‌థ‌కం కోసం ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 1387.19 కోట్లు ఖ‌ర్చె చేసిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో మాతా శిశు ఆరోగ్య సంర‌క్షణ కేంద్రాలు ప‌టిష్టం చేస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల సంక్షేమం, అభివృద్ది కోసం ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చారని వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులను పెద్ద ఎత్తున క‌ల్పించామ‌ని. కొత్త‌గా 23 మాతా శిశు సంర‌క్ష‌ణ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని మంత్రి తెలిపారు.గ‌ర్భిణీ స్త్రీలు ర‌క్త హీన‌త‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, వారికి న్యూట్రిష‌న్ కిట్ అందిస్తామ‌న్నారు. కుమ్రం భీం, ఆదిలాబాద్‌,భూపాల ప‌ల్లి, భ‌ద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్‌, గ‌ద్వాల్‌, న‌గార్ క‌ర్నూల్‌,ములుగు జిల్లాల్లో కెసిఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి తెల‌పారు.

Leave A Reply

Your email address will not be published.