India Corona: తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత రెండు రోజులు కొత్త కేసుల నమోదు 2 లక్షలకు దిగువగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 1,61,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం కరోనాబులిటెన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య
4,16,30,85కి పెరిగాయి.
గత 24 గంటల వ్యవధిలో దేశంలో 2,81,109 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,95,11,307 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గత 24 గంటల వ్యవధిలో దేశంలో 1733 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 4,97,975 మంది కరోనాతో మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో 16,21,603 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.