దేశంలో విస్త‌రిస్తోన్న క‌రోనా.. 60 వేల‌కు చేరువ‌లో కొత్త కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. మ‌ళ్లీ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. రెండు రోజులుగా 30 వేల‌కు పైగా న‌మోదైన కొత్త కేసులు.. ఇవాళ ఒక్క‌సారిగా 58 వేల‌కు చేరాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 13,88,647 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వహించ‌గా 58,097 మందికి క‌రోనా పాజిటివ్ గా తేలింది.
తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3.50 కోట్ల మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 2135కి పెరిగాయి. వీరిలో ఇప్ప‌టి వ‌ర‌కు 828 మంది కోలుకున్నారు.

ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ బుధ‌వారం క‌రోనా బులిలెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 534 మంది మ‌ర‌ణించార‌ని వెల్ల‌డించింది. అలాగే దేశ వ్యాప్తంగా 147.72 కోట్ల మందికి క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేసిన‌ట్లు కేంద్ర వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.