ఒక్క రోజులో 90 వేల కేసులు!

న్యూఢిల్లీ (CLiC2NEWS): క‌రోనా మ‌హమ్మారి మ‌ళ్లీ విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 90,928 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టితో పోలిస్తే కేసుల సంఖ్య రెండింత‌ల‌య్యాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 14,13,030 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

గ‌త 24గంట‌ల్లో రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 19,206 మంది.
గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో క‌రోనా బారిన ప‌డి 325 మంది మ‌ర‌ణించారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు శ‌ర‌వేంగా పెరుగుతున్నాయి. మెట్రో న‌గ‌రాల్లో 50 శాతానికి పైగా కేసుల‌కు ఈ వేరియంటే కార‌ణ‌మ‌ని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో ఈ కేసుల సంఖ్య ప్ర‌స్తుతం 2,630కి చేరింది. కొత్త‌గా 495 మంది ఈ వైర‌స్ బారిన ప‌డ్డారు. మహారాష్ట్రలో అత్య‌ధికంగా 979 మందికి ఈ వేరియంట్ సోకింది. ఆ త‌ర్వాత ఢిల్లీలో ఆ కేసుల సంఖ్య 465కి పెరిగింది.

Leave A Reply

Your email address will not be published.